తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ సహకారంపైనే ఆర్టీసీ మనుగడ: థామస్​రెడ్డి

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రశ్నించే గొంతు ఉండాలనే లక్ష్యంతో తిరిగి యూనియన్​ను తెరపైకి తెస్తున్నామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు థామస్​రెడ్డి అన్నారు. కరీంనగర్​లో జరిగిన ఆర్టీసీ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన కేసీఆర్ ప్రభుత్వానికి తాము సంపూర్ణ మద్దుతు ప్రకటిస్తున్నామని తెలిపారు.

tsrtc meeting in karimnagar
కరీంనగర్​లో ఆర్టీసీ యూనియన్ సమావేశం

By

Published : Apr 13, 2021, 8:50 PM IST

రాష్ట్ర ప్రభుత్వ సహకారంపైనే ఆర్టీసీ మనుగడ ఆధారపడి ఉందని తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు థామస్ రెడ్డి అన్నారు. కరీంనగర్​లో జరిగిన ఆర్టీసీ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ సీఎం కేసీఆర్​తో చర్చించి కార్మికులకు రావలసిన బకాయిలు ఇప్పించాలని కోరారు.

యూనియన్ మాజీ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి చర్యలతో ఆర్టీసీ అథోగతిపాలైందని థామస్​రెడ్డి అన్నారు. కార్మికుల ఒత్తిడితోనే ఆయన యూనియన్​కు రాజీనామా చేయాల్సివచ్చిందని పేర్కొన్నారు. తమ సంఘానికి గౌరవాధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కవితను నియమించినట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వానికి తాము సంపూర్ణ మద్దుతు ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు.

కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రశ్నించే గొంతు ఉండాలనే లక్ష్యంతో తిరిగి యూనియన్​ను తెరపైకి తెస్తున్నామని థామస్​రెడ్డి అన్నారు. కొందరు కమిటీల పేరుతో భాజపాకు అనుకూలంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details