తెలంగాణ

telangana

ETV Bharat / state

'మిడ్ మానేరుపై చర్చకు సై.. ఎమ్మెల్యేలూ రావాలి'

'మేం చర్చలకు సిద్ధం. మీ ఒక్కరే కాదు మీతోపాటు కొందరు ఎమ్మెల్యేలను కూడా తెచ్చుకోండి. అందరం కలిసి మిడ్ మానేరు జలాశయం అవకతవకలపై చర్చిద్దాం': పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నాయకుడు

'మిడ్ మానేరుపై చర్చకు సై.. ఎమ్మెల్యేలూ రావాలి'

By

Published : Sep 27, 2019, 7:51 PM IST

మిడ్ మానేరు జలాశయం అవకతవకలపై చర్చలకు సిద్ధమని తెరాస, కాంగ్రెస్ పార్టీ నాయకులు పరస్పరం సవాలు విసురుతున్నారు. తెరాస నేత, ఐడీసీ ఛైర్మన్ ఈద శంకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. మధ్య మానేరు నాణ్యత లోపాలపై కాంగ్రెస్​కు చెందిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.. గతంలో ఈ ప్రాజెక్టును కాంట్రాక్ట్ తీసుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్​తో కలిసి చర్చకు రావాలని ఈద శంకర్​ రెడ్డి సవాల్ విసిరారు. స్పందించిన పొన్నం ప్రభాకర్... ఈద శంకర్ రెడ్డి సవాలును స్వీకరిస్తున్నట్లు తెలిపారు. మిడ్​మానేరుపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చర్చలకు ఆహ్వానిస్తున్నట్లు... ఈద శంకర్ రెడ్డితో పాటు మరికొందరు తెరాస ఎమ్మెల్యేలు కూడా రావాలని పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు.

'మిడ్ మానేరుపై చర్చకు సై.. ఎమ్మెల్యేలూ రావాలి'

ABOUT THE AUTHOR

...view details