విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో జరుగుతున్న పాఠశాల క్రీడోత్సవాలకు ఆయన హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ క్రీడల్లో 600 మీటర్ల పరుగు పందెంలో గెలుపొందిన విజేతలను ఆయన సన్మానించారు.
'విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి' - latest news on minister gangula
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్లో జరుగుతున్న అండర్-14 జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఆయన హాజరయ్యారు.
'విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి'
క్రీడాకారులకు తగు సదుపాయాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే... మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారన్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లల్ని క్రీడల వైపు ప్రోత్సహించాలని మంత్రి సూచించారు.
ఇదీ చూడండి: చిత్రకళలో ఔరా అనిపించిన అంధులు