సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లో అట్టహాసంగా రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను జిల్లా కలెక్టర్ శశాంక, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు
రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలను కరీంనగర్లో నిర్వహించారు. వీటిలో ప్రతిభ కనబరిచిన సైక్లిస్టులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్టు సైక్లింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి తెలిపారు.
రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు
రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపుగా 150 మంది సైక్లిస్టులు ఈ పోటీలకు తరలివచ్చారు. వీటిలో ప్రావీణ్యం కనబరిచిన సైక్లిస్టులను ఈనెల 20వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపనున్నట్టు సైక్లింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నరేందర్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: పోలీస్ కమిషనరేట్‌ను సందర్శించిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్