నవమాసాలు మోసి జన్మనిచ్చేది అమ్మ. తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి మనిషి మరణించే వరకు సేవలు అందించేది "ఆశా". గర్భిణీలకు, బాలింతలకు, పసిపిల్లలకు, బాలలకు, పెద్దలకు, వృద్ధులకు అందరికీ దిక్కు "ఆశా కార్యకర్తలే ". తల్లిలా లాలిస్తూ, బుజ్జగిస్తూ, మాటలు పడుతూ, విధినిర్వహణలో తనకుతానే సాటి, తమలా సేవలు చేసేందుకు రారు ఎవరు పోటీ అంటూ ముందుకు వెళుతూ... చాలీచాలని జీతాలతో విధులు నిర్వహిస్తున్నారు "ఆశా" కార్యకర్తలు. (Asha workers)
కరోనా వేల రోగులకు వారే ఆశ..
ప్రపంచ వ్యాప్తంగా అందరిని వణికిస్తున్న కరోనా మహమ్మారి గ్రామీణ ప్రాంతాలకు పాకింది. కుటుంబాలకు కుటుంబాలే అంతరిస్తున్నాయి. కొన్ని కుటుంబాల్లో ఎవరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా "ఆశా" ముందుండి సూచనలు, సలహాలు అందిస్తున్నారు. అనేక కుటుంబాల్లో కరోనా కరాళ నృత్యంతో బంధాలు తెగిపోతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనాకు ఎదురొడ్డి, రోగుల ఇళ్ళ వద్దకు నేరుగా వెళ్ళి వైద్యం చేస్తూ, వారిలో మనోధైర్యాన్ని నింపుతూ మీ ప్రాణాలకు మేమున్నామంటూ, కరోనా బాధితులకు అండగా ఉంటున్నారు.
తక్కువ వేతనంతోనే విధులు..
వైద్య ఆరోగ్య శాఖలో అతి తక్కువ వేతనంతో విధులు నిర్వహిస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే వారు "ఆశా" కార్యకర్తలు మాత్రమే. ప్రతి "ఆశా" కార్యకర్త స్థానికంగా నివాసం ఉంటూ ప్రజల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని ఉన్నతాధికారులకు తెలియజేస్తారు. "ఆశా" వర్కర్ల ముఖ్య విధి గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు, వృద్ధులకు మందులను, టీకాలను ,పౌష్టికాహారం ఇవ్వడం. ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యేందుకు "ఆశా"లు ఎంతో దోహదపడుతున్నారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి అదనంగా కోవిడ్ విధులను కూడా నిర్వహిస్తున్నారు. ఇన్ని రకాలుగా సేవలందిస్తున్న వారికి ప్రభుత్వం నుంచి అరకొర వేతనాలు మాత్రమే అందుతున్నాయి. కరోనా విధుల్లో పాల్గొంటున్న ప్రత్యేక అలవెన్సులు రావడంలేదని వాపోతున్నారు.
ఫీవర్ సర్వేలో ప్రధాన పాత్ర..