కరీంనగర్ జిల్లా నుంచి ప్రత్యేకంగా 600 ఆర్టీసీ బస్సులు మేడారం జాతర కోసం నడుపనున్నట్లు రీజియన్ మేనేజర్ జీవన్ ప్రసాద్ తెలిపారు. ఈనెల 26 నుంచి ప్రయోగాత్మకంగా ఈ బస్సులు నడుపుతున్నామన్నారు. కరీంనగర్, గోదావరిఖని నుంచి మేడారం వెళ్లేందుకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు.
మేడారం జాతరకు 600 ప్రత్యేక బస్సులు - మేడారం ప్రత్యేక బస్సులు తాజా వార్త
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రత్యేకంగా 600 ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుపనున్నట్లు రీజియన్ మేనేజర్ జీవన్ ప్రసాద్ తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఈ బస్సులు నడుపుతామని పేర్కొన్నారు.
మేడారం జాతరకు 600 ప్రత్యేక బస్సులు
సాధారణ బస్సు ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులు నేరుగా సమ్మక్క సారలమ్మల గద్దె సమీపం వరకు ప్రయాణించే అవకాశం ఉంటుందని.. ప్రైవేటు వాహనాల్లో వెళ్లే భక్తులకు ఈ సదుపాయం ఉండదని ఆర్‌ఎం జీవన్ ప్రసాద్ వివరించారు.
ఇవీ చూడండి:క్రియాశీల నగరాల్లో ప్రపంచంలోనే హైదరాబాద్‌కు తొలిస్థానం