కరీంనగర్ డిపో నుంచి ఆర్ఎం కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు ర్యాలీ చేపట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని టీఎంయూ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి' - ఆర్టీసీ ఉద్యోగులు
కరీంనగర్లో ఆర్టీసీ ఉద్యోగులు ఆర్ఎం కార్యాలయాన్ని ముట్టడించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
'ఆర్టీసీ సమస్యలను పరిష్కరించండి'