కరీంనగర్ జిల్లా గంగాధర, రామడుగు మండలాల్లో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ఆధ్వర్యంలో హరితహారం చేపట్టారు. గంగాధర, కాచిరెడ్డిపల్లితో పాటు రామడుగుల్లో అధిక సాంద్రతలో పండ్ల మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకున్నారు.
కరీంనగర్ జిల్లాలో ప్రకృతి వనం పెంచాలి: అదనపు కలెక్టర్ - అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ హరితహారం కార్యక్రం
ప్రతి గ్రామంలో ప్రకృతి వనం పెంచేందుకు నాలుగు వేల మొక్కలు నాటి సంరక్షించాలని కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కోరారు. జిల్లాలోని పలు మండలాల్లో అధిక సాంద్రతలో పండ్ల మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకున్నారు.
కరీంనగర్ జిల్లాలో ప్రకృతి వనం పెంచాలి: అదనపు కలెక్టర్
ప్రతి గ్రామంలో ప్రకృతి వనం పెంచేందుకు నాలుగు వేల మొక్కలు నాటి సంరక్షించాలని శ్యామ్ ప్రసాద్ కోరారు. ప్రతి మండలంలో మంకీ ఫుడ్ కోర్ట్, మియావాకి పద్ధతిలో మొక్కలు నాటి కాపాడాలన్నారు. అత్యల్ప అటవీ సంపద కలిగిన కరీంనగర్ జిల్లాలో హరితహారాన్ని విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చాలని సూచించారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..