కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిషత్ అధ్యక్షుడు మార్కొండ కిష్టారెడ్డి ఓ పంచాయతీ కార్యదర్శిపై ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు ఎనిమిది గ్రామాలకు ఇంఛార్జి కార్యదర్శిగా పనిచేసిన రమేష్ ఏడున్నర లక్షల రూపాయలు కాజేశారని ఆరోపించారు. పన్నులు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా ఆరు నెలలుగా సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
'పంచాయతీ కార్యదర్శి ఏడున్నర లక్షలు కాజేశారు' - MPP MAARKONDA KISTAREDDY'
ఓ ఎంపీపీ నేరుగా ప్రభుత్వ ఉద్యోగి మీద ఆరోపణలు చేసిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పంచాయతీ కార్యదర్శి రమేష్ పెద్ద మెుత్తంలో డబ్బులు కాజేశారని ఆరోపించారు.
ఈ అంశంపై సీఎంకు ఫిర్యాదు చేస్తా : రామడుగు ఎంపీపీ
పంచాయతీ విస్తరణాధికారి ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక అందజేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సీఎం, పంచాయతీరాజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : 'తప్పుడు ర్యాంకుల కళాశాలలపై డీజీపీకి ఫిర్యాదు'