కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆర్టీసీ కార్మీకులు భారీ ర్యాలీ నిర్వహించారు. డిపో నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. కార్యాలయంలోకి వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఐకాస నాయకులను మాత్రమే కార్యాలయంలోకి అనుమతించారు. ఆర్డీవో బోయపాటి చెన్నయ్యను కలిసి తమ సమస్యలను వివరించారు. కార్మికులను కార్యాలయంలోకి అనుమతించాల్సిందిగా నాయకులు కోరగా... అనుమతించారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రాన్ని సమర్పించారు. కార్మికులకు భాజపా, జర్నలిస్ట్ సంఘాలు మద్దతు పలికాయి. అంబేడ్కర్ కూడలి వద్ద సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
హుజూరాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల భారీ ర్యాలీ - 6TH DAY OF TSRTC STRIKE
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్‌లో ఆర్టీసీ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించి... ఆర్డీవోకు వినతి పత్రాన్ని సమర్పించారు.
RTC EMPLOYEES PROTEST ON 6TH DAY AT HUZURABAD