తెలంగాణ

telangana

ETV Bharat / state

రైల్వేగేటుపై ఓవర్‌బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం - ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు

ROB Problems Karimnagar : కరీంనగర్ రైల్వే గేటుపై ఓవర్‌బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నిత్యం పదుల సంఖ్యలో రైళ్లు వెళ్తుండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రైల్వే గేటుకు ఇరువైపులా ప్రధాన ఆసుపత్రులు ఉండటమే కాకుండా కరీంనగర్ కార్పొరేషన్‌లోని పలు డివిజన్లు కూడా గేటు అవతల ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు

Traffic Problems At Railway Gate in Karimnagar
Karimnagar Railway Gate Problems

By ETV Bharat Telangana Team

Published : Jan 17, 2024, 12:43 PM IST

గేటు పడిందా ఆగాల్సిందే - రైల్వేగేటుపై ఓవర్‌బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం - ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు

ROB Problems Karimnagar :కరీంనగర్ వాసులకు రైల్వే గేటుపై ఓవర్‌బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నిర్మాణం ఆలస్యం కారణంగా వందలాది వాహనాలు ప్రయాణించే కరీంనగర్‌ లక్సెట్టిపేట రహదారిలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణలో తాత్సారం చేయకుండా పనులు త్వరగా పూర్తి చేయాలని ఎంపీ బండి సంజయ్‌ కోరుతున్నారు.

Traffic Problems At Railway Gate in Karimnagar : కరీంనగర్ నుంచి చొప్పదండి వైపు వెళ్లే మార్గంలో ఉన్న రైల్వే గేటుపై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్‌ గత ఏడేళ్లుగా ఉంది. రైల్వే గేటుకు ఇరువైపులా ప్రధాన ఆసుపత్రులు ఉండటమే కాకుండా కరీంనగర్ కార్పొరేషన్‌లోని పలు డివిజన్లు కూడా గేటు అవతల ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోజూ కనీసం 40కి పైగా రైళ్లు ప్రయాణిస్తుండగా ప్రతిసారి 10 నుంచి 15 నిమిషాల పాటు ట్రాఫిక్ స్తంభించిపోతుంది.

దేవరకద్ర ఆర్వోబీకి మోక్షం ఎప్పుడు.?

గేటు పడితే ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్లే రైల్వేఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అమృత్ భారత్ పథకంలో భాగంగా కరీంనగర్‌ రైల్వేస్టేషన్‌ ఆధునీకరణకు ప్రత్యేకంగా 50కోట్లు మంజూరు చేయించాము. మార్చిలోగా కరీంనగర్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు పూర్తి అవుతాయి.- బండి సంజయ్, కరీంనగర్ ఎంపీ

Railway Gate Problems In Karimnagar: రైల్వే గేటు ఏర్పాటు చేయాలని 2015 లోనే రైల్వేశాఖను అప్పటి ఎంపీ వినోద్‌ కుమార్ కోరారు. అయితే ఈ మార్గంలో వెళ్లే రైళ్ల సంఖ్య తక్కువగా ఉన్న కారణంగా రైల్వే గేటు ప్రతిపాదనను ఆ శాఖ అంగీకరించలేదు. ఆ తర్వాత సమీప గ్రామాలు కార్పోరేషన్‌లోకి విలీనం కావడమే కాకుండా రైళ్ల సంఖ్య కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి రైల్వేశాఖకు విన్నవించడంతో ఆర్‌ఓబీ నిర్మాణానికి అంగీకరించింది. అయితే పనులు మాత్రం వేగవంతంగా సాగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గేటు పడిందా అరగంట ఆగాల్సిందే..!

ప్రతిరోజు కనీసం 40కుపైగా రైళ్లు ప్రయాణిస్తున్నాయి. ప్రతిసారి గేటు పడటంతో 10నుంచి 15 నిమిషాలు ట్రాఫిక్ ఆగిపోతోంది. అంబులెన్స్​లు కూడా సమయానికి వెళ్లలేకపోతున్నాయి. ఈ కారణంగా వైద్య సేవల కోసం వెళ్తున్నవారు సేవలు అందక చనిపోతున్నారు. అధికారులు పట్టించుకోని రైల్వే గేటు పనులు పూర్తి చేయాలి. - స్థానికులు

Karimnagar Railway Gate Problems :అయితే రాష్ట్రప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్లే రైల్వేఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోయాయని ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. భూసేకరణలో కొంత తాత్సారం జరుగుతోందని ఆరోపించారు. పనులు వేగవంతం చేయాలంటే భూసేకరనణ యుద్దప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. మార్చిలోగా కరీంనగర్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు పూర్తి అవుతాయని వివరించారు రైల్వేగేట్ నిర్మాణంలో జాప్యం కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Devarakadra Railway Gate : రైల్వేగేటు మూశారు.. కొత్త ప్రాబ్లమ్స్​ తెచ్చారు

రైల్వే గేట్ వద్ద కింద పడిన బారికేడ్.. భారీగా ట్రాఫిక్ జామ్

ABOUT THE AUTHOR

...view details