తెలంగాణ

telangana

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

By

Published : Mar 28, 2021, 6:09 PM IST

తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం జరిగింది. విద్యార్థులు తమ గురువులను ఆహ్వానించి సన్మానం చేశారు.

students reunion programme
ఆత్మీయ సమ్మేళనం

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 2006-07 బ్యాచ్​కు చెందిన పదో తరగతి విద్యార్థులు తమకు విద్యా బోధన చేసిన గురువులను ఆహ్వానించి సన్మానం చేశారు. అధ్యాపకులతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details