రంజాన్ వేడుకలు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరాడంబరంగా జరిగాయి. కరోనా ప్రభావంతో ప్రార్థన మందిరాలు, దేవాలయాలను పూర్తిగా మూసేశారు. ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమికూడకుండా ప్రభుత్వం పెట్టిన కఠిన నిబంధనలను ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు.
కరీంనగర్లో నిరాడంబరంగా రంజాన్ వేడుకలు
కరీంనగర్లో రంజాన్ వేడుకలు ఎలాంటి హంగూఆర్బాటాలు లేకుండా జరిగాయి. లాక్డౌన్ ప్రభావంతో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేశారు. ఈద్గాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కరీంనగర్లో నిరాడంబరంగా రంజాన్ వేడుకలు
రంజాన్ పర్వదినం రోజ ప్రతి యేటా ముస్లింలతో నగరం కిటకిటలాడేది. లాక్డౌన్ ప్రభావంతో ఇళ్లలోనే ప్రార్థనలు చేశారు. నగరంలోని గీతాభవన్ కూడలి, రాజీవ్చౌక్తోపాటు రేకుర్తి, ఈద్గా వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. భౌతిక దూరం పాటిస్తూ ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు.