కరీంనగర్ నగరంలోని వివేకానందపురి కాలనీలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక మండపంలో సరస్వతీ పూజ కన్నుల పండువగా నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం చేశారు. గణనాథుడి ముందు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. సరస్వతి దేవి కటాక్షాన్ని పొందేందుకు కాలనీలోని చిన్నారులు పెద్ద ఎత్తున అక్షర అభ్యాసంలో పాల్గొన్నారు.
వినాయకుని చెంత చిన్నారులకు అక్షరాభ్యాసం - prayar
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వివేకానందపురి కాలనీలో గణనాథుని మండపంలో సరస్వతి పూజలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.
పూజ చేస్తున్న మహిళలు