కేసీఆర్ను ప్రశ్నించే దమ్ము భాజపాకు లేదు: పొన్నం - ponnam
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలపై నిలదీసేందుకు భాజపాకు ధైర్యం లేదని విమర్శించారు పొన్నం ప్రభాకర్. అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన కమలదళం దుకాణం మూసుకుపోయిందా అని ప్రశ్నించారు.
రెండు పడక గదుల ఇల్లు, దళితులకు 3 ఎకరాల భూమిపై కేసీఆర్ను ప్రశ్నించే ధైర్యం భాజపాకు లేదని కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం నిర్వహించిన జెండా పండుగలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ దుకాణం మూసివేతకు గురైందన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ వ్యాఖ్యలపై పొన్నం తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన భాజపా దుకాణం మూసుకుపోయిందా అని ప్రశ్నించారు.
- ఇదీ చూడండి : ప్రగతిభవన్లో కేసీఆర్తో ఏపీ సీఎం భేటీ