తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్యకర్తలు ఎంపిక చేసిన వారికే టికెట్

యువతకు పెద్దపీట వేస్తూ కార్యకర్తలు ఎంపిక చేసిన వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని పొన్నం స్పష్టం చేశారు. అభ్యర్థుల గెలుపు కోసం అంతా కృషి చేస్తామని కార్యకర్తలకు పొన్నం హామీ ఇచ్చారు.

By

Published : Apr 15, 2019, 3:44 PM IST

కార్యకర్తల సమావేశంలో పొన్నం

కాంగ్రెస్ పార్టీ యువతకు పెద్దపీట వేస్తున్నట్లు తెలంగాణ పీసీసి కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్​గౌడ్ తెలిపారు. వేములవాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు ఎంపిక చేసిన వారికే టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్, నియోజకవర్గ బాధ్యుడు ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తల సమావేశంలో పొన్నం

ABOUT THE AUTHOR

...view details