లోక్‌సభ పోరుకు కరీంనగర్ జిల్లా సిద్ధమైంది. రేపు సాయంత్రంలోగా అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తం కానుంది. పోలింగ్‌కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ పాల్గొన్నారు.
కరీంనగర్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో 16 లక్షల 61 వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. బూత్‌కు 1200 మంది ఓటర్ల చొప్పున మొత్తం 2181 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వీడియో రికార్డింగ్ లేదా లైవ్ వెబ్ కాస్టింగ్ ఉంటుంది. దాదాపు 21వేల మంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. సమారు 5వేల మంది పోలీసులను భద్రత కోసం ఉపయోగిస్తున్నారు.