రెడ్డి సామాజిక వర్గాలకు విద్య, ఉద్యోగ ఉపాధి రంగాల్లో పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని రెడ్డి ఐకాస రాష్ట్ర ఛైర్మన్ రాంరెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వం ఓసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిందని గుర్తు చేశారు. ఈ రిజర్వేషన్లను పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని.. మన రాష్ట్రంలో అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక నిధులతో రెడ్డి కార్పొరేషన్.. రెడ్డి విద్యార్థులకు ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేయాలన్నారు. 50 సంవత్సరాలు దాటిన రైతులకు నెలకు మూడు వేల రూపాయల పింఛను వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం వర్తింపజేయాలన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించిన వారికి వచ్చే ఎన్నికల్లో సహకరిస్తామని లేనిపక్షంలో మా కార్యచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు.
'రెడ్డి సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కావాలి'
విద్య, ఉద్యోగ ఉపాధి రంగాలలో రెడ్డి సామాజిక వర్గాలకు పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని రెడ్డి ఐకాస ఛైర్మన్ రాంరెడ్డి అన్నారు.
రిజర్వేషన్లు అమలు చేయండి
ఇవీ చూడండి: ఈరోజు నుంచే సచివాలయ శాఖల తరలింపు..