తెలంగాణ

telangana

ETV Bharat / state

'పెన్షనర్ల సమస్యల పట్ల సీఎంతో చర్చిస్తా' - హుజూరాబాద్​లో మంత్రి ఈటల పర్యటన

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో జాతీయ పెన్షనర్ల దినోత్సవంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. పింఛనుదారుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Pensioners meeting in huzurabad
'పెన్షనర్ల సమస్యల పట్ల సీఎంతో చర్చిస్తా'

By

Published : Dec 17, 2019, 8:01 PM IST

పింఛనుదారుల సమస్యల పట్ల ముఖ్యమంత్రితో చర్చిస్తానని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో జాతీయ పెన్షనర్ల దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మన సంప్రదాయలు చాలా గొప్పవని చెప్పుకునే మన దేశంలో... నేడు పాశ్చాత్య నాగరికత ఒరవడిలో కొట్టుకుపోతున్నామన్నారు. అన్ని జీవాల కంటే గొప్ప జీవితం.. మానవ జీవితమన్నారు. మానవ జీవితం తృప్తిగా ఉండాలంటే డబ్బు మాత్రమే అన్ని అందించలేదన్నారు.

'పెన్షనర్ల సమస్యల పట్ల సీఎంతో చర్చిస్తా'

ABOUT THE AUTHOR

...view details