తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు గోదావరిఖనిలో... "సింగరేణి" పింఛన్ అదాలత్! - ramagundam

పింఛన్​దారుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 23న గోదావరిఖని పీఎఫ్​ కార్యాలయంలో పింఛన్ అదాలత్​ నిర్వహించనున్నట్టు సీఎం పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్​ నవీన్​ కుమార్​ తెలిపారు.

గోదావరిఖనిలో ఈ నెల 23న పింఛను అదాలత్​

By

Published : Aug 22, 2019, 10:21 AM IST

గోదావరిఖనిలో ఈ నెల 23న పింఛను అదాలత్​

విశ్రాంత సింగరేణి కార్మికుల పింఛన్ సమస్యల పరిష్కరానికి ఈ నెల 23న పింఛన్ అదాలత్​ నిర్వహిస్తున్నట్లు సీఎం పీఎఫ్​ ప్రాంతీయ కమిషనర్ నవీన్​ కుమార్​ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గోదావరిఖని పీఎఫ్​ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పింఛన్​ అదాలత్​ ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. రామగుండం-1, 2, 3 ఏరియాలతోపాటు భూపాలపల్లి, శ్రీరాంపూర్​, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాల్లోని విశ్రాంత కార్మికులు హాజరై సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో 56 వేల మంది ఉన్నట్లు పేర్కొన్నారు. భర్త చనిపోతే భార్యకు అందించనున్నట్లు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details