తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్కడికి టిఫిన్​ బాక్స్ తప్పనిసరిగా​ పట్టుకెళ్లాలి. ఎందుకో?

చికెన్​ షాపుకు వెళ్తే ఖాళీ చేతులతో వెళ్లి పాలిథీన్​ కవర్లలో మాంసం తెచ్చుకుంటాం. కానీ కరీంనగర్​లోని భగత్​నగర్​లో టిఫిన్​ బాక్సుల్లో మాంసం తీసుకెళ్తూ పర్యావరణానికి తమ వంతు కృషి చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

By

Published : Oct 16, 2019, 6:14 PM IST

అక్కడికి టిఫిన్​ బాక్స్ తప్పనిసరిగా​ పట్టుకెళ్లాలి. ఎందుకో?

అందరూ టిఫిన్ బాక్సులు పట్టుకొని క్యూలైన్లో ఎందుకు నిల్చున్నారు అనుకుంటున్నారా? అదే మల్లేశం చికెన్ సెంటర్ ప్రత్యేకత. ఈయన చికెన్ సెంటర్​కు వస్తే టిఫిన్ బాక్సులు పట్టుకొని వచ్చి క్యూలైన్లో వేచి ఉండాల్సిందే. ప్లాస్టిక్​ను నిషేధించాలని కోరుతూ ఆయన నా ఈ నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ భగత్ నగర్​లోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మల్లేశం చికెన్ సెంటర్ ముందు ప్లాస్టిక్​ను నిషేధించాలని అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడటం వల్ల చాలా నష్టాలన్నాయని... భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ప్రజలు ఆలోచించాలని లయన్స్ క్లబ్ నిర్వాహకులు కోరారు. ప్రజల్లో మార్పు రావాలని... స్వచ్ఛందంగా ప్లాస్టిక్​ను నిషేధించినప్పుడే భావితరాలకు మంచి వాతావరణాన్ని కల్పించిన వాళ్లమవుతామని వారు తెలిపారు.

అక్కడికి టిఫిన్​ బాక్స్ తప్పనిసరిగా​ పట్టుకెళ్లాలి. ఎందుకో?

ABOUT THE AUTHOR

...view details