పదో తరగతి పరీక్షకు ఒకే ఒక విద్యార్థి హాజరయ్యాడు. ఈ పరీక్ష నిర్వహించడం కోసం 8 మంది అధికారులు విధులు నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్‌లోని న్యూ శాతావాహన ఉన్నత పాఠశాలలో ప్రైవేటు పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
పరీక్షా కేంద్రంలో ఒకే విద్యార్థి..డ్యూటీలో ఎనిమిది మంది
పరీక్షా కేంద్రంలో ఒకే ఒక్క విద్యార్థి పరీక్ష రాసిన ఘటన హుజూరాబాద్‌లో చోటు చేసుకుంది. ఎగ్జామ్‌ను నిర్వహించేందుకు 8 మంది అధికారులు విధులు నిర్వహించారు.
పరీక్షా కేంద్రంలో ఒకే విద్యార్థి..డ్యూటీలో ఎనిమిది మంది
ఈ పరీక్షా కేంద్రంలో సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి, ఇన్విజిలేటర్, ఆరోగ్య సహాయకుడు, ముగ్గురు పోలీసులు, అటెండర్ విధులు నిర్వహించారు.
ఇవీచూడండి:కరీంనగర్లో కరోనా కలకలం..అప్రమత్తంగా ఉండాలని మంత్రి విన్నపం