హుజూరాబాద్-పరకాల ప్రధాన రహదారి పక్కన జియో నెట్‌వర్క్ కేబుల్లను అతికించేందుకు ఐదుగురు వ్యక్తులు వెళ్లారు. రోడ్డు పక్కనే కేబుల్ కోసం గుంత తవ్వారు. అంబాల ప్రవీణ్, శివరాత్రి మైసయ్య అనే ఇద్దరు వ్యక్తులు భూమిలోపలికి దిగి తీగలు కలుపుతుండగా... ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న మట్టికుప్పలు కూలాయి. పైనున్న వ్యక్తులు గ్రామంలోకి వెళ్లి విషయం చేరవేయగా... సమాచారాన్ని పోలీసులకు తెలిపారు.
పనిచేస్తుండగా మట్టిగడ్డలు కూలి యువకుడు మృతి - ONE MAN DIED IN JIO CABLE WORKS
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ఓ చరవాణి కంపెనీకి సంబంధించిన కేబుల్ పనులు చేస్తుండగా... మట్టి పెళ్లలు కూలిపడ్డాయి. ప్రమాదంలో ఇద్దరు భూమిలోనే ఇరుక్కుపోగా... పోలీసులు, అగ్నిమాపక, అంబులెన్స్ సిబ్బంది రెస్య్కూ ఆపరేషన్ చేశారు. ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా, మరో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు.
హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకోని సహాయక చర్యలు చేపట్టారు. రెండు జేసీబీ వాహనాల సహాయంతో... సుమారు రెండున్నర గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. మట్టిగడ్డల కింద ఇరుక్కపోయిన వారిని బయటకు తీయగా... అంబాల ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. శివరాత్రి మైసయ్య తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మృతుడు వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం అరువపల్లికి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. గాయపడ్డ మైసయ్య... రాజన్నసిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ వాసిగా తెలిపారు. రాత్రివేళల్లో ఎవరి అనుమతితో పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారనే వివరాలు తెలియాల్సి ఉందని ఏసీపీ శ్రీనివాస్‌రావు తెలిపారు.