కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన వృద్ధ దంపతులు దీన స్థితిలో కనిపించారు. తమ కొడుకులు పట్టించుకోకపోవటం వల్ల బోయిని లచ్చమ్మ నర్సయ్య దంపతులు గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయం ముందు రెండు రోజులుగా తిండి లేకుండా ఉంటున్నారు. ఈ దంపతుల స్థితిని చూసి స్థానికులు చలించిపోయారు. వారికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉన్న మూడెకరాల భూమి కుమారులకు ఇచ్చారు. ఇద్దరు కొడుకుల గ్రామంలోనే నివాసం ఉంటున్నా... తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. పదేళ్ల నుంచి వీరి పోషణ పెద్ద కూతురు చూసుకుంది. కానీ తర్వాత పరిస్థితులతో ఇంటి నుంచి పంపించేసింది. స్థానికుల సమాచారంతో పోలీసుల అక్కడికి చేరుకొని విచారించారు. ఎట్టకేలకు చిన్న కొడుకు తల్లిదండ్రులను ఇంటికి తీసుకెళ్లాడు.
ఆస్తులు పంచుకున్నారు... అమ్మానాన్నని మరిచారు
పిల్లల్ని కని పెద్దచేసి ఆస్తి పంచిచ్చారు. ఎవరికి వాళ్లు బతుకుతున్నారు. కానీ తల్లిదండ్రులను మాత్రం వదిలేశారు. ఆదరించేవారు లేక గుడి ముందు దిక్కు తోచని స్థితిలో ఉన్న వృద్ధులను చూసి స్థానికులు చలించిపోయారు.
దిక్కు లేనోళ్లకు దేవుడే దిక్కు... నిజమేనేమో!