తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యమాల గడ్డపై ఉత్సాహంగా నామినేషన్లు

నామినేషన్ల చివరి రోజు ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలోని రిటర్నింగ్​ కార్యాలయాల్లో సందడి నెలకొంది. కరీంనగర్, పెద్దపల్లి​ పార్లమెంట్​ స్థానాలకు కాంగ్రెస్​, భాజపా, తెరాస అభ్యర్థులు నామినేషన్​ దాఖలు చేశారు.

"ఉద్యమాల గడ్డపై నామినేషన్ల జోరు"

By

Published : Mar 26, 2019, 7:53 AM IST

Updated : Mar 26, 2019, 12:29 PM IST

ఉద్యమాల గడ్డపై ఉత్సాహంగా నామినేషన్లు
సోమవారం నామపత్రాల దాఖలుకు చివరిరోజు అయినందునకరీంనగర్​, పెద్దపల్లి రిటర్నింగ్​ కార్యాలయాలు కిటకిటలాడాయి. కరీంనగర్​ పార్లమెంట్​ స్థానానికి కాంగ్రెస్​ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ నామినేషన్​ వేశారు. జిల్లా కేంద్రంలోని సర్కస్ ​గ్రౌండ్​ నుంచి పార్టీ కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు రావాలంటే హస్తం పార్టీని గెలిపించాలని కోరారు.

పూజల అనంతరం:

ప్రజలను తెరాస నేతలు అయోమయానికి గురి చేస్తున్నారని కరీంనగర్​ భాజపా అభ్యర్థి బండి సంజయ్​ అన్నారు. పార్లమెంట్​ అభ్యర్థిగా ఆయన నామినేషన్​ సమర్పించారు. అంతకుముందు మహాశక్తి దేవాలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు.

మద్దతుగా మంత్రి కొప్పుల:

పెద్దపల్లిలో తెరాస పార్లమెంట్​ అభ్యర్థి వెంకటేష్​ నామినేషన్​ వేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్​, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దాసరి మనోహర్​రెడ్డిలు మద్దతుగా వెళ్లారు. భాజపా అభ్యర్థిగా ఎస్​.కుమార్​ నామపత్రాలు సమర్పించారు. నియోజకవర్గానికి చెందిన కమలనేతలతో కలిసి పత్రాలను రిటర్నింగ్​ అధికారికి అందించారు.

Last Updated : Mar 26, 2019, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details