తెలంగాణ

telangana

ETV Bharat / state

మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా - municipal workers protest

బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నాకు దిగారు.

మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా

By

Published : Oct 3, 2019, 4:21 PM IST

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ మున్సిపల్​ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నాకు దిగారు. బకాయిపడిన జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. జీవో నెం.14 ప్రకారం జీతాలివ్వాలని నినాదాలు చేస్తూ సీఐటీయూ నాయకులు మద్దతు పలికారు. విలీన గ్రామ పంచాయతీ కార్మికులకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్​కు వినతిపత్రాన్ని అందజేశారు.

మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details