తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్​కే మా మద్దతు: ఎమ్మార్పీఎస్ - congress

తెలంగాణలో కాంగ్రెస్​కు ఎమ్మార్పీఎస్ తమ మద్దతు ప్రకటించింది. కరీంనగర్​లో మందకృష్ణ మాదిగ ఈ ప్రకటన చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్...​ విజయానికి కార్యకర్తలంతా కృషి చేయాలని సూచించారు.

కాంగ్రెస్​కు మద్దతు ప్రకటిస్తున్న మంద కృష్ణ

By

Published : Apr 9, 2019, 10:13 AM IST

తెలంగాణలో లోక్​సభ స్థానాలకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మద్దతిస్తోందని మందకృష్ణ మాదిగ కరీంనగర్​లో స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి సోనియా అన్న కేసీఆర్ ఆ పార్టీని అణచివేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ నుంచి బరిలో ఉన్న పొన్నం ప్రభాకర్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించినందున లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు మందకృష్ణ చెప్పారు.

కాంగ్రెస్​కు మద్దతు ప్రకటిస్తున్న మంద కృష్ణ

ABOUT THE AUTHOR

...view details