మండల ప్రజా పరిషత్ అధ్యక్ష ఎన్నికలకు కరీంనగర్ జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాల ఎంపీపీల ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామడుగు మండల పరిషత్ కార్యాలయానికి తెరాస ఎంపీటీసీ సభ్యులతో పాటు వారి మద్దతుదారులైన ఎంపీటీసీ సభ్యులు ఉదయాన్నే చేరుకున్నారు. చొప్పదండి మండలంలోని ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు కిడ్నాప్ ప్రచారంతో ఎన్నికల వాతావరణం ఉద్రిక్తంగా మారింది. గంగాధర, బోయినపల్లి, కొడిమ్యాల, మల్యాల మండల కార్యాలయాల ముందు ఇతరులను అనుమతించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
బందోబస్తు మధ్య ఎంపీపీ ఎన్నికలు - elections
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజవర్గంలోని ఆరు మండలాల పరిషత్ పాలక వర్గం ఎన్నికలకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయాల్లోకి చరవాణిలు అనుంతిచడం లేదు.
కార్యాలయంలోకి వెళ్తున్న ఎంపీటీసీలు