రైతుల నుంచి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని.. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రైతు శ్రేయస్సే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని వివరించారు. కరీంనగర్ జిల్లాలోని.. చొప్పదండి, భూపాలపట్నం, వెదురుగట్టలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే - mla sunke ravi shankar
కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు ఎమ్మెల్యే. కరోనా విజృంభణ దృష్ట్యా మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు. తూకం సకాలంలో పూర్తి చేసి, చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి:తప్పనిసరి అయితేనే బ్యాంకుకు రావాలి: ఎస్‌బీఐ