కరీంనగర్ జిల్లా చొప్పదండిలో.. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రహదారులపై తిరుగుతూ.. మాస్కులు తప్పనిసరిగా ధరించాలంటూ ప్రచారం చేశారు. మాస్కులు లేకుండా తిరుగుతోన్న ప్రజలను ఆపి.. వాటిని అందజేశారు.
'సెకండ్ వేవ్ కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలి' - చొప్పదండి కొవిడ్ కేసులు
రాష్ట్రంలో రెండో దశ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. నిబంధనలు ఉల్లంఘించడంతో.. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో కేసులు భారీగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో.. స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రంగంలోకి దిగారు. రహదారులపై తిరుగుతూ.. మహమ్మారిపై అవగాహన కల్పించారు.
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
కరోనా సెకండ్ వేవ్ కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. పట్టణంలో.. కేసులు భారీగా నమోదవుతున్నాయని వివరించారు. 45 సంవత్సరాలు నిండిన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి:వెంకటేశ్వర ఆలయంలో ముస్లింల పూజలు