కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్‌లో ఉపాధి హామీ పనులను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరిశీలించారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరానికి 55 లక్షల 28 వేల పని దినాలు లక్ష్యంగా నిర్దేశించటం వల్ల పనులు చేపట్టేందుకు డీఆర్డీఓ వెంకటేశ్వర రావు చర్యలు తీసుకున్నారు.
ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే - ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరిశీలించారు. కూలీలందరూ భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాలని సూచించారు.
ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
వేసవిలో ఉపాధి హామీ కూలీలకు 30 శాతం అదనంగా చెల్లించాల్సి ఉండటం వల్ల దినసరి కూలీలు ఉపాధి పనులకు ఉత్సాహం చూపుతున్నారు. చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో పరిమిత సంఖ్యలో నిబంధనలకు లోబడి సామాజిక దూరం పాటిస్తూ ఉపాధి హామీ పనులు మొదలుపెట్టారు. కూలీలకు మంచి నీటితో పాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచేందుకు అధికారులు క్షేత్ర సహాయకులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చూడండి:ఈటీవీ భారత్ ఎఫెక్ట్: వృద్ధురాలికి ఎమ్మెల్యే సాయం