తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - కరీంనగర్​ జిల్లా వార్తలు

కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ చెక్కులు పంపిణీ చేశారు. లాక్​డౌన్​ కొనసాగుతున్నా ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతోందని ఎమ్మెల్యే అన్నారు.

mla kalyanalaxmi cheques distribution
mla kalyanalaxmi cheques distribution

By

Published : May 19, 2020, 7:07 PM IST

కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిషత్​లో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చెక్కులు పంపిణీ చేశారు. లాక్​డౌన్​ కొనసాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమంపై శ్రద్ధ చూపుతోందని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారినా ముఖ్యమంత్రి కేసీఆర్​ వ్యవసాయంపై అధిక ప్రాధాన్యత చూపుతున్నారని స్పష్టం చేశారు.

కల్యాణలక్ష్మి లబ్ధిదారుల దరఖాస్తులను అధికారులు ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


ఇవీ చూడండి:'కమీషన్ల కోసం 4 జిల్లాలను ఎండబెడుతున్నారు'

ABOUT THE AUTHOR

...view details