భాజపా నాయకులు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఈటల మోసానికి - గెల్లు విధేయతకు మధ్య జరుగుతున్న పోటీనే హుజూరాబాద్ ఎన్నికలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. హుజూరాబాద్‌లో భాజపా పట్టణ అధ్యక్షుడితో పాటు పలువురు పార్టీలో చేరిన సందర్భంగా కండువా కప్పి ఆహ్వానించారు. రాజేందర్ ఎక్కడ ఉపన్యాసానికి వచ్చినా తాను గెలిస్తే ఏ పని చేస్తారో చెప్పకుండా తెరాసపై బురద జల్లుతున్నారని ఆయన విమర్శించారు .
వాళ్లే ఫ్యూజులు పీక్కొని.. సభలకు కరెంట్ కట్ చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ ఆరోపించారు. వాళ్లే మైక్ కట్ చేసుకుని, తెరాస వాళ్లు కట్ చేశారని బురద జల్లుతున్నారన్నారు. బట్ట కాల్చి మీద వేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ప్రభుత్వం అన్ని రకాలుగా రక్షణ ఇస్తుందని వారు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. తాను డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిన, ఓ కాలేజీ తెచ్చిన, ఓ స్టేడియం తెచ్చిన అని చెప్పే పరిస్థితి లేదని ఈటల రాజేందర్‌ను మంత్రి ఎద్దేవా చేశారు.
ఈటల రాజేందర్ భాజపాలో చేరితే ఆ పార్టీ పరిస్థితి మరోలా ఉందన్నారు. నల్ల ధనం వెనక్కు తెచ్చి ప్రజల అకౌంట్లలో వేస్తామన్న భాజపా సర్కారు.. వేసిందా అంటూ హరీశ్ ప్రశ్నించారు. బీసీ జనగణన చేపట్టాలని అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా... కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రంతో మాట్లాడి బీసీ జనగణన జరిగేలా చూడాలని ఈటలకు సూచించారు. కేంద్రప్రభుత్వం రోజురోజుకూ ధరలు పెంచి సామాన్యుల నడ్డివిరుస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. పండుగ రోజుల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారని ధ్వజమెత్తారు.
'ఈటల మోసానికి - గెల్లు విధేయతకు మధ్య పోటీనే.. హుజూరాబాద్ ఎన్నికలు' బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను పెట్టాలని తెలంగాణ శాసనసభ ఏక గ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.. దాని మీద స్పందించండి రాజేందర్ గారూ. బీసీల కోసం పనిచేసిన ఆర్.కృష్ణయ్య తీర్మానం చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బీసీ జనగణనకు కేంద్రాన్ని ఒప్పించి నేను బీసీ నేతను అంటే ప్రజలు హర్షిస్తరు. రాజేందర్ ఎక్కడ ఉపన్యాసానికి వచ్చినా.. నేను ఈ పని చేసినా.. గెలిస్తే ఇది చేస్తా అని చెప్పకుండా బురద జల్లుతున్నారు. అంతిమంగా న్యాయం గెలుస్తది, ధర్మం గెలుస్తది. -హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి
ఇదీ చదవండి:Etela Rajender at Sriramula Pally: కేసీఆర్ కత్తి అందిస్తే.. హరీశ్ వచ్చి పొడుస్తుండు: ఈటల