అభివృద్ధి పనుల కోసం కోట్ల రూపాయలు వెచ్చించినా.. శాఖల మధ్య పరస్పర సమన్వయం లేక ప్రభుత్వం నవ్వుల పాలవుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్‌లో స్మార్ట్‌సిటీ పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని ప్రధాన రహదారులు అధ్వానంగా తయారయ్యాయని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. నగరంలో స్మార్ట్ సిటీ పనులు ఎక్కడ చేపట్టబోతున్నారనే అంశంపై అధికారులు పరస్పర అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పనులను పకడ్బందీగా పర్యవేక్షించాలని కలెక్టర్‌కు మంత్రి సూచించారు.
"శాఖల మధ్య సమన్వయం కొరవడుతోంది"
అభివృద్ధి పనుల కోసం కోట్ల రూపాయలు వెచ్చించినా.. శాఖల మధ్య సమన్వయం లేక ప్రభుత్వం నవ్వుల పాలవుతోందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి గంగుల