కరీంనగర్లో నూతనంగా ఏర్పడిన కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం చేపట్టారు. అధికారులతో పాటు గ్రామ ప్రజలు భారీగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. అధికారులు, గ్రామ ప్రజలతో కలిసి మొక్కలు నాటి హరితహారం కార్యక్రమం ప్రారంభించారు. రాణీపురం నుంచి రెండు కిలోమీటర్లమేర రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు.
కేసీఆర్ మెచ్చేలా పనిచేద్దాం.. రాష్ట్రాన్ని హరితమయం చేద్దాం: గంగుల
కరీంనగర్లోని కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమాన్ని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. అధికారులు, గ్రామ ప్రజలతో కలిసి మొక్కలు నాటుతున్నారు. సీఎం కేసీఆర్ మెచ్చే విధంగా కొత్తపల్లి మునిసిపాలిటీని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
minister gangula kamalakar started in haritha haaram program
గ్రామంలోని ఒక ఎకరం ప్రభుత్వ భూమిలో మియావాకి పద్ధతిలో మొక్కలు నాటినట్లు కొత్తపల్లి ఎంపీపీ రాధాగోపాల్ రెడ్డి తెలిపారు. తమ గ్రామం పలువురికి ఆదర్శంగా ఉండాలని హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ మెచ్చే విధంగా కొత్తపల్లి మునిసిపాలిటీని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:రాష్ట్రానికి కేంద్రం జీఎస్టీ నష్ట పరిహారం చెల్లించేనా?
TAGGED:
6th phase haritha haaram