గుజరాత్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ తరహా కరీంనగర్‌లో మానేరు రివర్ ఫ్రంట్‌ను తీర్చిదిద్దుతున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆ క్రమంలోనే కొత్తగా జెట్టీబోట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం అనంతరం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువమానేరుకు నీరు రావడం నిలిచిపోయిందని ఆయన చెప్పారు. దిగువమానేరును గత పాలకులు చాకిరేవుగా మాత్రమే వినియోగించుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం కాళేశ్వరం జలాల రాకతో రైతులకు సాగునీరుతో పాటు కరీంనగర్ పర్యటక హబ్‌గా మారబోతుందని మంత్రి వెల్లడించారు. దిగువ మానేరు జలాశయం మధ్యలో కేసీఆర్ ఐలాండ్ నిర్మాణ ప్రతిపాదన సిద్ధమైందంటున్న మంత్రి గంగుల కమలాకర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'కేసీఆర్ ఐలాండ్ నిర్మాణ ప్రతిపాదన సిద్ధం'
కరీంనగర్‌లో మానేరు రివర్‌ఫ్రంట్‌ను తీర్చిదిద్దబోతున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. దిగువమానేరు జలాశయం మధ్యలో కేసీఆర్ ఐలాండ్ నిర్మాణ ప్రతిపాదన సిద్ధమైందని వెల్లడించారు.
'కేసీఆర్ ఐలాండ్ నిర్మాణ ప్రతిపాదన సిద్ధం'
Last Updated : Sep 30, 2019, 8:30 AM IST