కరోనా ఉద్ధృతి దృష్ట్యా అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్‌లో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామని విపత్తు వేళ ప్రజలకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకే ఫీజులు వసూలు చేయాలి: కమలాకర్ - కరోనా ఫీజులపై మంత్రి సమీక్ష
కరోనా విజృంభిస్తున్న తరుణంలో రోగుల వద్ద అధిక ఫీజులు వసూలు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్రస్థాయిలో మాదిరి కరీంనగర్ జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.
బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్
నగరంలో సిటీ స్కాన్‌కు కేవలం రూ.2 వేలు, మిగతా సేవలకు సంబంధించిన రుసుములు ప్రభుత్వ నిర్దేశం మేరకే వసూలుచేయాలని మంత్రి తెలిపారు. ఈ సమావేశానికి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యంతో పాటు కెమిస్టు అండ్ డ్రగ్గిస్టు అసోసియేషన్, డయాగ్నోస్టిక్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు.