తెలంగాణ

telangana

ETV Bharat / state

రాక్​గార్డెన్ ప్రారంభించిన మంత్రి గంగుల - తెలంగాణ వార్తలు

కరీంనగర్​లోని పోలీస్ శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన రాక్​గార్డెన్​ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. పోలీసుల కృషితో 40 ఎకరాల శిక్షణ కేంద్రంలో అధిక శాతం అడవిగా మారిందని కితాబిచ్చారు. సీపీ కృషితో ఈ కేంద్రం ఆక్సిజన్ పార్క్‌‌గా మారిందని అభినందించారు.

Minister Gangula kamalakar inaugurated the Rock Garden, minister gangula kamalakar latest news
రాక్​గార్డెన్ ప్రారంభం, మంత్రి గంగుల కమలాకర్ లేటెస్ట్ న్యూస్

By

Published : May 25, 2021, 1:35 PM IST

కరీంనగర్‌ పోలీస్ శిక్షణ కేంద్రంలో అభివృద్ది చేసిన రాక్‌గార్డెన్‌ను బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావుతో కలిసి ప్రారంభించారు. దాదాపు 40ఎకరాల్లో ఉన్న శిక్షణ కేంద్రంలో అధికశాతం అడవిగా మారిందని మంత్రి కొనియాడారు. శాంతిభద్రతలకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చే పోలీసులు... సీపీగా కమలాసన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మొక్కల పెంపకంపై దృష్టి సారించారని అన్నారు.

సీపీ కృషితో పోలీస్ శిక్షణా కేంద్రం ఆక్సిజన్ పార్క్‌‌గా మారిందని అభినందించారు. పోలీసుల కృషి పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:అలంకారప్రాయంగా ఎయిమ్స్‌.. భరోసా ఇవ్వలేని పెద్దాసుపత్రి

ABOUT THE AUTHOR

...view details