పట్టణ ప్రగతిలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 23వ డివిజన్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు. క్షేత్రస్థాయిలో కాలనీలన్నీ తిరుగుతూ... పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు.
'మిగిలిన సమస్యలను రెండో విడతలో పూర్తి చేస్తాం..'
కరీంనగర్లో ఉన్న సమస్యాత్మక కాలనీలను గుర్తించామని... ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదిక పంపిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
'మిగిలిన సమస్యలను రెండో విడతలో పూర్తి చేస్తాం..'
నరగంలో ప్రధానాంశంగా ఉన్న తాగునీరు, మురుగు కాలువల సమస్యలను గుర్తించామని... వాటిని రెండో విడతలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నగరంలో ఖాలీ స్థలాలున్న యజమానులను గుర్తించి నోటీసులు పంపిస్తామని, రహదారికి సమాంతరంగా ఉండే విధంగా ప్లాట్ల నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. లేనిపక్షంలో భూ యజమానులపై చర్యలు తీసుకుంటామని మంత్రి గంగుల హెచ్చరించారు.
ఇవీ చూడండి:'అప్రమత్తంగానే ఉన్నాం.. ఆందోళన చెందకండి'