మహారాష్ట్రలో గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టు కట్టినప్పుడు.. తాను అక్కడికి వెళ్లి దెబ్బలు తిన్నట్లు మంత్రి గంగుల కమలాకర్ గుర్తు చేశారు. ఇప్పడు ఎంపీ బండి సంజయ్ కూడా హైదరాబాద్‌లో కాకుండా పోతిరెడ్డిపాడుకు వెళ్లి ధర్నా చేయాలని అన్నారు. ఏపీలో ఉన్న భాజపా నేతల ఇళ్లపై నల్లజెండాలు పెట్టి నిరసన వ్యక్తం చేయమని గంగుల ఎద్దేవా చేశారు.
'ఇక్కడ కాదు.. పోతిరెడ్డిపాడులో ధర్నా చేయాలి' - minister gangula kamalakar about pothireddypadu
పోతిరెడ్డిపాడుపై ధర్నా చేయాలంటే ఎంపీ బండి సంజయ్ అక్కడికి వెళ్లి నిరసన తెలపాలంటూ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్లో పర్యటించనున్నట్లు ఆయన వెల్లడించారు.
గంగుల కమలాకర్ మీడియా సమావేశం
కరీంనగర్లో కరోనా వ్యాప్తి భయపెట్టినా.. కేసీఆర్ ప్రణాళికలతో.. చాకచక్యంగా తిప్పికొట్టినట్లు మంత్రి చెప్పారు. త్వరలో కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నట్లు గంగుల వెల్లడించారు. హుజూరాబాద్‌లో ఉండే ప్రగతిశీల రైతులు.. ఇప్పటికే అక్కడ నీటి వసతులు తయారు చేసుకున్నారని అన్నారు. వారితో కలిసి సన్నరకాల పంటకు సీఎం నాట్లు వేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:లక్ష్మీపురంలో విషాదం.. కుటుంబాన్ని మింగేసిన చెరువు