కరీంనగర్ జిల్లాలోని వెదురుగట్ట గ్రామంలో హరితహారం కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ హాజరై మొక్కలు నాటారు. పూర్వం కరీంనగర్ వనాలకు ప్రసిద్ధి చెందిందని... కానీ గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల జిల్లా వనాలను కోల్పోయిందని మంత్రి గంగుల పేర్కొన్నారు.
''నా చిన్నతనంలో అడవులు ఎక్కువగా ఉండటం వల్ల జిల్లాలో వర్షాలు అధికంగా ఉండేవి. కాలాక్రమేణా ప్రభుత్వాలు మారి... అడవుల సంరక్షణ తగ్గి ఈ ప్రాంతమంతా నిర్జీవమైపోయింది. వర్షపాతం తగ్గింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక... హరితహారం కార్యక్రమం ద్వారా మళ్లీ కరీంనగర్ పచ్చతోరణంలా కనిపిస్తోంది. ఈ ఆరో విడత హరితహారంలో భాగంగా జిల్లాలో 50లక్షల మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. పనులు కూడా ప్రారంభించాం. భావితరాలకు ఈ కార్యక్రమం బంగారు బాట అవుతుంది.''