కరీంనగర్‌లోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో.. పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు మంత్రి గంగుల కమలాకర్ చీరలు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు రమేశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో.. మేయర్ సునీల్‌రావు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య సిబ్బంది సేవలు భేష్ : మంత్రి గంగుల
కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య సిబ్బంది అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్‌లోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
పారిశుద్ధ్య సిబ్బంది సేవలు భేష్: మంత్రి గంగుల
కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య సిబ్బంది అందించిన సేవలు ఎనలేనివని మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల సంక్షేమం కోసం పని చేసిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: వావ్:చెత్త తీసిన చేతులతోనే అబ్బురపరిచే చిత్రాలు