తెలంగాణలో కరోనా రెండో దశ వ్యాప్తి లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉద్ఘాటించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రిలో మంత్రి ఈటల టీకా తీసుకున్నారు. అర్హులైన వారంతా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న ఆస్పత్రుల్లో టీకా వేయించుకోవాలన్నారు. కొవిడ్ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని చెప్పారు.
కొవిడ్ టీకా తీసుకున్న మంత్రి ఈటల రాజేందర్ - minister etela took covid vaccine
కొవిడ్ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పునరుద్ఘాటించారు. అర్హులైన వారంతా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
కొవిడ్ టీకా తీసుకున్న మంత్రి ఈటల రాజేందర్
హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో పెద్ద సంఖ్యలో వృద్ధులు టీకా తీసుకుంటున్నారు. ఫీవర్ ఆస్పత్రి వద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి.. టీకా తీసుకునేందుకు వృద్ధులు తరలివచ్చారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి.. ఏర్పాట్లను పరిశీలించారు. ఇన్నాళ్లు కొవిడ్‌తో పోరాడిన తాము... టీకా తీసుకోవటం సంతోషంగా ఉందని.. పలువురు సంతోషం వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి :జోరుగా మూడో దశ కొవిడ్ వ్యాక్సినేషన్
Last Updated : Mar 1, 2021, 12:15 PM IST