తెలంగాణ

telangana

ETV Bharat / state

వీలైనంత త్వరగా ప్రతి ఇంటికి భగీరథ నీరు అందాలి: ఈటల - హుజూరాబాద్​ తాజా వార్తలు

సాధ్యమైనంత త్వరగా కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి మిషన్​ భగీరథ నీరు అందించాలని మంత్రి ఈటల ఆదేశించారు. మిషన్​ భగీరథ పనులకు సంబంధించి అధికారులతో మంత్రి సమీక్షించారు. నాణ్యతతో, వేగంగా పనిచేసే గుత్తేదారులకు భగీరథ పనులు అప్పగించాలని అధికారులకు తెలిపారు.

వీలైనంత త్వరగా ప్రతి ఇంటికి భగీరథ నీరు అందాలి: ఈటల
వీలైనంత త్వరగా ప్రతి ఇంటికి భగీరథ నీరు అందాలి: ఈటల

By

Published : May 30, 2020, 8:01 PM IST

సాధ్యమైనంత త్వరగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఇంటింటికి.. మిషన్‌ భగీరథ నీళ్లు అందించాలని వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. మిషన్‌ భగీరథ పనులకు సంబంధించి కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు. హుజూరాబాద్‌, జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట, కమలాపూర్‌ మండలాల్లోని మిషన్‌ భగీరథ పనులను గురించి... అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పనుల్లో జాప్యతపై అధికారులను ప్రశ్నించిన మంత్రి ఈటల.. వీలైనంత త్వరగా ఇంటింటికి మంచినీరు అందించాలన్నారు. నాణ్యతతో, వేగంగా పనిచేసే గుత్తేదారులకు పనులు అప్పగించాలని అధికారులకు తెలిపారు. ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులతో సమన్వయమవుతూ... పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.

ఇవీ చూడండి: జూన్​ 30 వరకు లాక్​డౌన్ 5.0-​ కీలక మార్గదర్శకాలు ఇవే

ABOUT THE AUTHOR

...view details