రానున్న రెండు నెలల్లో రాజరాజేశ్వర జలాశయం(మధ్య మానేరు) ద్వారా అన్ని గ్రామాలకు సాగునీరు అందిస్తామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లిలో మధ్య మానేరు అనుసంధానంగా నిర్మిస్తున్న కాల్వ పునరుద్ధరణను ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సతీశ్బాబుతో కలిసి ప్రారంభించారు.
మరో రెండు నెలల్లో ప్రతి ఎకరాకూ సాగునీరు: మంత్రి ఈటల - minister eetala rajendhar at karimnagar
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లిలో మధ్య మానేరు అనుసంధానంగా నిర్మిస్తున్న కాల్వ పునరుద్ధరణను మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సతీశ్బాబులు కలిసి ప్రారంభించారు.
'రానున్న 2నెలల్లో అన్ని గ్రామాలకు సాగునీరు అందిస్తాం'
కాలువలను పూర్తి చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో ఇప్పటికే నాలుగుసార్లు సమీక్షలు జరిపి క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు మంత్రి తెలిపారు. ఆయా పనుల యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జడ్పీఛైర్పర్సన్ కనుమల విజయ స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష