దిశాలాంటి ఘటనల్లో ఉరిశిక్షలు, ఎన్కౌంటర్లు తాత్కాలిక ఉపశమనాలే కానీ... శాశ్వత పరిష్కారం కాదని మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. సమాజంతో మార్పు రావాలని అప్పుడే ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కావద్దని ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో మానవ వికాస వేదిక రాష్ట్రస్థాయి 3వ వార్షిక మహాసభకు మంత్రి హాజరయ్యారు.
'ఉరిశిక్షలు, ఎన్కౌంటర్లు తాత్కాలిక ఉపశమనాలే...'
దిశ ఘటనపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. అత్యాచార కేసుల్లో నిందుతులకు ఉరిశిక్షలు, ఎన్కౌంటర్లు తాత్కాలిక ఉపశమనాలే కానీ శాశ్వత పరిష్కారాలు కావని మంత్రి అభిప్రాయపడ్డారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో నిర్వహించిన మానవ వికాస వేదిక రాష్ట్ర స్థాయి 3వ వార్షిక మహసభకు మంత్రి హాజరయ్యారు.
MINISTER EETALA RAJENDER COMMENTS ON DISHA INCIDENT
విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహా, ఆలోచనల ఘర్షణలు లేకపోవటం వల్ల మనుషులు మృగాలుగా మారుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మానవ జీవితాన్ని సుసంపన్నం చేయటం కోసం వచ్చిన టెక్నాలజీ... ఇప్పుడు సమాజ వినాశనానికి అడుగులు వేసేలా చేస్తున్నాయని వివరించారు.
ఇదీ చూడండి: అయేషా గోళ్లు, ఎముకలు, కేశాల పరిశీలన