తెలంగాణ

telangana

ETV Bharat / state

'మొక్కల సంరక్షణ మీదే... వాటి ఆదాయం మీదే' - 'మొక్కల సంరక్షణ మీదే... వాటి ఆదాయం మీదే'

రాష్ట్రాన్ని హరితవనంగా తీర్చిదిద్దేందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టినట్లు వైద్యఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.

'మొక్కల సంరక్షణ మీదే... వాటి ఆదాయం మీదే'

By

Published : Aug 28, 2019, 1:22 PM IST

కరీంనగర్‌ జిల్లా కందుగులలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. మామిడి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయని... నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని మంత్రి సూచించారు. నాలుగు సంవత్సరాలుగా కోట్ల మొక్కలను నాటామన్నారు. గ్రామాల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో మొక్కలు నాటుతామన్నారు. ఎస్సారెస్పీ, కాలువ గట్టు స్థలాల్లో మొక్కలను నాటాలని సూచించారు. వాటిని పెంచే బాధ్యతను ఆ గ్రామాల్లో ఉన్న నిరుపేదలకు అప్పగిస్తామన్నారు. వాటి నుంచి వచ్చే ఆదాయం వారికే దక్కేలా చూస్తామని మంత్రి వెల్లడించారు.

'మొక్కల సంరక్షణ మీదే... వాటి ఆదాయం మీదే'

ABOUT THE AUTHOR

...view details