తెలంగాణ

telangana

ETV Bharat / state

జన్మనిచ్చిన మాతృమూర్తికి పాదపూజ

సృష్టికి మూలం అమ్మ. మాతృమూర్తి లేనిదే జగత్తు లేదు. మరి మనకు జన్మనిచ్చిన తల్లికి పాదపూజ చేయడం మన అదృష్టం అంటున్నారు కరీంనగర్ చిన్నారులు.

జన్మనిచ్చిన మాతృమూర్తికి పాదపూజ

By

Published : May 7, 2019, 4:59 PM IST

Updated : May 7, 2019, 5:09 PM IST

జన్మనిచ్చిన మాతృమూర్తికి పాదపూజ

లోకంలో ప్రతి ఒక్కరికీ కన్నతల్లే మొదటి గురువు, దైవం. ఈ విషయాన్ని అందరికీ తెలియజేసేందుకే... మాతృదేవో భవ... పితృ దేవో భవ... ఆచార్య దేవో భవ... అన్నారు పెద్దలు. ఇలాంటి విషయాలను మర్చిపోతున్న నేటి సమాజానికి కనువిప్పు కలిగేలా కరీంనగర్​లో మాతృమూర్తులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించారు.

చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో కరీంనగర్​లో వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. 14 రోజుల ఈ శిక్షణలో భాగంగా ఈరోజు మాతృమూర్తులకు చిన్నారులు పాదపూజ చేశారు. చిన్నప్పటినుంచే పిల్లలకు సంప్రదాయాలను అలవాటు చేస్తే క్రమశిక్షణతో మెలుగుతారని చిన్మయ మిషన్ నిర్వాహకులు పేర్కొన్నారు.

తమ బిడ్డలు తల్లి మీద ప్రేమ, గౌరవం, భక్తితో పూజ చేయడం చాలా సంతోషాన్నిస్తుందని చిన్నారుల తల్లులు తెలిపారు.

ఇవీ చూడండి: అలా వచ్చాడు... ఇలా కొట్టేశాడు...

Last Updated : May 7, 2019, 5:09 PM IST

ABOUT THE AUTHOR

...view details