Masti Goli Soda in Karimnagar : నెలవారీ జీతం వస్తుంది కదా అని చేతులు ముడుచుకు కూర్చుంటే.. మరో పది మందికి ఉపాధి ఎలా కల్పించగలమంటున్నాడు కరీంనగర్‌కు చెందిన తుల రఘునాథ్. సాఫ్ట్‌వేర్ రంగంలో మంచి ఉద్యోగం ఉన్నా.. కోయంబత్తూర్‌లో చూసిన గోలీ సోడా ఇక్కడ ఎందుకు పెట్టకూడదనే ఆలోచనతో వ్యాపారం ప్రారంభించాడు. తన ఆలోచన చెప్పినప్పుడు కొందరు వద్దని వాదిస్తే, ఇంకొందరు ఎగతాళి చేశారు. కానీ తను మాత్రం పట్టు విడవలేదు. ఇంజినీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌గా స్థిరపడ్డాడు. కానీ, మనసు వ్యాపారంవైపు లాగడంతో గోలీసోడా తయారీ వైపు పరుగులు తీశాడు. పెట్టుబడి లేకుంటే ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు సమకూర్చుకున్నాడు. కాలానికి అనుగుణంగా కొత్త రుచులను ఆస్వాదిస్తున్న ప్రజలను మళ్లీ బాల్యంలోని జ్ఞాపకాల వైపు తీసుకెళ్లారు.
Masti Goli Soda : మస్తీ సోడా కంపెనీ ప్రారంభించాడు. కొత్త కార్పొరేట్ రుచులకు అలవాటైన జనాన్ని తనవైపు తిప్పుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. కాలానికి అనుగుణంగా కొత్త రుచులు ఆస్వాదిస్తున్న జనాలకు ఆధునికత జోడించి తమ బాల్యాలకు తీసుకెళ్లాడు. ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్టు తయారీకి సంబంధించిన సమాచారంతో పాటు అందులో వాడే పదార్థాల వివరాలను తెలిపాడు. తన సంస్థలో వర్కర్స్ చాలా బాగా పని చేస్తున్నారని చెబుతున్నాడు రఘునాథ్. ప్రస్తుతం మల్టీనేషన్ కంపెనీల కూల్‌డ్రింక్స్‌తో తమ గోలీసోడా పోటీపడటం ఆనందంగా ఉందంటున్నారు. తాను ఒకరి కింద ఉద్యోగం చేసే కన్నా.. మరో వంద మందికి ఉపాధి కల్పిస్తున్నానని కొంత గర్వంగా ఉందని చెబుతున్నారు. 3 పదుల వయస్సులో రిస్క్ తీసుకోకపోతే ఇంకెప్పుడు తీసుకుంటామన్న ఆలోచన ముందుకు నడిపించిందని చెబుతున్నారు. తమకు తమిళనాడులోనూ బ్రాంచీ ఉందని తెలిపాడు.