వేములవాడలో భక్తులకు బెల్లం లడ్డూలు
వేములవాడ దేవస్థానంలో సరికొత్త అంకం ఆవిష్కృతమైంది. మొట్టమొదటిసారిగా ఆలయ అధికారులు బెల్లంతో చేసిన లడ్డూలను అందుబాటులోకి తెచ్చారు. దేవాదాయ శాఖ ఆదేశాలతో ఈరోజు నుంచి బెల్లం లడ్డూలను భక్తులకు విక్రయించడం ప్రారంభించారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో బెల్లంతో తయారు చేసిన ప్రసాదాలను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. ఆలయంలో గత మాసంలో బెల్లంతో తయారు చేసిన పొంగలి విక్రయాలను ప్రారంభించారు. తాజాగా రాజన్న ఆలయంలో బెల్లంతో తయారుచేసిన లడ్డూల విక్రయాన్ని శుక్రవారం ఆలయ ఈవో దూస రాజేశ్వర్ ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంల్లో దేవాదాయశాఖ ఆదేశాలతో బెల్లంతో తయారు చేసిన ప్రసాదాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. రాజన్న ఆలయంలో త్వరలోనే సిరా, గారెల ప్రసాదాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.